| ఇంతింతగా పెరిగే నన్నూ, నా బరువునూ |
| తొమ్మిదినెలలు ఎలా భరించావు అమ్మా? |
| నువ్వు ఓరిమిలో ధరిత్రివే కావచ్చు |
| అనుక్షణం అన్ని కష్టాలు ఎలా పడ్డావమ్మా? |
| పిండరూపాన ఉన్న నేను ఎక్కడ రాలిపోతానో అని |
| ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకున్నావు? |
| కూర్చునేటప్పుడు..నిల్చునేటపుడు..పడుకునేటప్పుడు |
| ఆపసోపాలు పడుతూ బాధని మునిపంట భరించావేకాని |
| ఎప్పుడూ చిరాకు పడలేదు |
| నెలలు నిండకుండా పుడతామోనని |
| అంగవైకల్యం, బుద్ధిమాంధ్యంతో పుడతానేమోనని |
| మొక్కులెన్ని మొక్కుకున్నావు? |
| మామూలు కాన్పయినా...పెద్దాపరేషనయినా |
| అది నీకు ఖచ్చితంగా పునర్జన్మే! |
| ప్రాణాన్ని పణంగా పెట్టి నువ్వు వధ్యశిలనెక్కుతున్నట్టే! |
| కష్టాలన్నీ నువ్వు పడినా! |
| అదేంటో చిత్రంగా పుట్టగానే మేమేడుస్తాము |
| మమ్మల్ని చూసి బాధలు మరచి |
| తన్మయత్వాన్నందుతావు! |
ఇల్లాలు ఇంటికి దీపమే కాదు ఇలవేల్పు కూడా!
(సుజనరంజని ప్రచురితం) |
0 comments:
Post a Comment