topbella

Wednesday, March 9, 2011

అమ్మ వచ్చేసింది..!

అమ్మకోసం చూసిన నాకు
ఈ అబ్బాయి చిక్కాడు...
అలసిపోయిన మదికి
అమృతాల విందు పంచాడు...

ఆప్యాయతల మంచుకొండ
అమ్మే, వాడిలా వచ్చిందేమో
అనురాగాల మల్లెదండ
వదల్లేక మళ్లీ అల్లుకుందేమో

కూతురిగా అమ్మ రాగలిగినప్పుడు
కొడుకులా మారకూడదా..
కొడుకుగా కాచుకున్న నాకే,
కొడుకై నాతల్లి కూర్చుందేమో...

వాడి చిట్టి చేష్టలు, చిన్ని ఊసులు
బోసి నవ్వులు, పిడికిలి ముద్రలు
చిలిపి చిన్నెలు, నిద్రాభంగిమలు
అన్నీ అచ్చు నాలాగే ఉన్నాయట

వాడు నేనైపోతే... నేను ఏమౌతాను
అంతలా కమ్మేస్తే నేనెలా కనపడతాను
మాయలా చుట్టేస్తే మాయమైపోతానా..
చూసేవారికి నేను మళ్ళీ పుట్టాను...

అమ్మ ఉంటే అసలు విషయం చెప్పేది
మదిలో దాగిన మాటల గుట్టు విప్పేది 
ఆమె ఒడిలో నేపోయిన చిన్నెలన్నీ
మళ్ళీ ఇప్పుడు నాకు చూపిస్తుందని...
                             -కేశవ్...

నేను...

My photo
కేశవ్... ప్రసారభాష పుస్తక రచయిత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలక్ట్రానిక్ మీడియా ఉత్తమ జర్నలిస్టు పురస్కారగ్రహీత. ప్రస్తుతం సిక్స్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్...